ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

రెడ్డిగారూ! యూ టూ!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

Scene – 1; Take – 1

“అదీ సంగతి” అని ముగించాడు అహమ్మద్ పటేల్.

“అవున”న్నట్లుగా చూసింది సోనియా మేడమ్.

“హుమ్! అప్పిడియా!” అన్నాడు కాలిముత్తుమార శివకుమారన్ ఫ్రం వైద్యనాదీశ్వరన్ కోయిల్.

కాలిముత్తు తన ముందు రాసి పోసున్న తాళపత్రాల్లో ఓ కట్ట తీసుకుని “ఇంగపారు రాగుల్! ప్లీస్ పుళ్ వొన్ ళీఫ్” అన్నాడు. రాహుల్ బుద్దిగా లాగాడు.

కొన్ని అసహనీయమైన క్షణాల తర్వాత కాలిముత్తు పెదవ్విరుస్తూ “అమ్మాళ్! యువర్ సన్ను నేము నాట్ గుడ్డు. రాగు (రాహు) ఈస్ దేర్ ఇన్ నేమిట్సెల్ఫు. ప్ళీస్ చేంజ్ ఇట్టు ఇమ్మీడియేట్లీ.  ఎన్ తంబి…మీన్స్ సిన్న తంబి…రన్నింగ్ నేమింగ్ కన్సళ్టెన్సీ. ఇంద కార్డ్. ప్ళీస్ కాంటాక్ట్.” అని చక్కాపోయాడు.

**********

Scene – 1; Take – 2

“గురువాయూరప్పా! మేడం! రాగుళ్ మోనిక్కుం గ్రఘచారం నాట్ గుడ్.  దెట్స్ వొయ్ మారేజ్ నోట్ హాపెణింగ్.  వుయ్ హావ్టు డు బిగ్ పూజ. టేక్ మై కార్డ్. కాళ్ మీ ఓన్ నెగ్శ్ట్ మండే.”

“ష్యూర్”

**********

Scene – 2; Take – 1

“మేడమ్! ఐ బ్రాట్ ది బెస్ట్ కౌన్సిలర్ ఫ్రం ఆంధ్ర. మీట్ మిస్టర్ దైవజ్ణ వర్మ.” అన్నారు జైపాల్ రెడ్డి.

“హెల్లో! మిస్టర్ డైవ్ గన్ వెర్మా! ప్లీజ్ సిడౌన్”

“రెడ్డిగారు! జాతకాన్ని చూసాను. ఏం ఢోకా లేదు. కాకపోత్ అబ్బాయికి పెళ్ళి పట్ల రుచి లేనట్టుంది. దీనికి మంచి మందు మన తెలుగు సినిమా పాటలు. ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి.  కొన్ని బలమైన పాటల్ని రాసాను.

“కళ్యాణము చూతము రారండి…”

“పెళ్ళంటే నూరేళ్ళ పంట – అది పండాలి కోరుకున్న వారి యింట పండాలి”

పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు..ఆ..ఆ.ఆ..’

ఐ థింక్ దే విల్ డు ద నీడ్ ఫుల్. ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ వి విల్ టేక్ మైండోగ్రామ్ అండ్ థాటోగ్రఫీ టూ”

**********

Scene – 2; Take – 2

రాహుల్ గాంధీ గది.

కళ్ళు మూసుకుని ఈజీ ఛేర్ లో జారిగిలపడి ఐపాడ్లో పాటలు వింటున్న రాహుల్ గాంధీని తలుపు అద్దాల నుంచి చూసి కళ్ళు తుడుచుకుంది సోనియా.

*********

Scene – 3; Take – 1

డైవ్ గన్ వెర్మ, జైపాల్ రెడ్డి మరియు సోనియాగాంధి…మొహాల్లో ఆత్రుత, కాతురం, ఉద్వేగం.

రాహుల్ గాంధీ నుదుటికి, మోచేతులకు, మోకాళ్ళకు నానా రకాల మీటలు అతికించి వున్నాయి.

పక్కనే ఉన్న ప్రింటర్లు రెండూ బరాబరా ప్రింట్ చేస్తున్నాయి.

డైవ్ గన్ వెర్మ ప్రింటౌట్ తీసి చూసి నోటి మీద చెయ్యి వేసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

కంగారు పడిన రెడ్డిగారు, సోనియమ్మ పక్కనే ఉన్న వెర్మ అసిస్టెంట్ కేసి చూసారు.

ఆ అమ్మాయి ప్రింటౌట్ ను అనువదించడం మొదలెట్టింది.

వెర్మ ప్రశ్న: “మీకు పెళ్ళంటే చాలా ఇష్టం…”

రాహుల్ మనసు: “కల ఇదని, నిజమిదని, తెలియదులే బ్రతుకింతేనులే….”

వెర్మ ప్రశ్న: “మీకు భార్య ఉంటే బాగుంటుందని బలంగా అనిపిస్తోంది”

రాహుల్ మనసు: “ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి..నా కాలం, ఖర్మం…కలిసొచ్చాకె రండిరా రండి”

వెర్మ ప్రశ్న: “ఇప్పుడు మీకు తీవ్రమైన ఆలోచన వస్తోంది. ఏమిటది?”

రాహుల్ మనసు: “భద్రం! బీ కేర్ ఫుల్ బ్రదరు! భర్తగ మారకు బ్యాచిలరు! షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్”

**********

Scene – Final ; Take – Final

“జైపాల్ రెడ్ది గారు! హౌ డిడ్ దిస్ హ్యాపెన్!”

“మేడమ్! అది…మరి…మరి…వెర్మ ప్రిస్క్రైబ్ చేసిన పాటలు ఢిల్లీలో దొరక్కపోతే…జగన్ కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసాను…అంతే”

“వ్వాట్ట్! రెడ్డిగారూ! యూ టూ…..”

*********