ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గీత గోవిందము – షష్ఠ సర్గము

Like-o-Meter
[Total: 0 Average: 0]

ద్వాదశ అష్టపది – ఆడియో (Audio track of 12th Ashtapadi)

images/stories/ashtapadi/21 Asta12 Sankara pra.mp3

 

 

షష్ఠ: స్సర్గ: – సోత్కంఠ వైకుంఠ:

 


 


శ్లో. అధ తాం గంతుమశక్తాం చిరమనురక్తాం లతా గృహే దృష్ట్వా
 తచ్చరితం గోవిందే మనసిజ మందే సఖీ ప్రాహ

 

గోవిందుని కడకు వేళ్ళుటకు కూడా కదలలేని రాధ పొదరింటి యందే కృష్ణునితో క్రీడించ వలెనని కోరుచున్నది.  ఈవిషయము సఖి కృష్ణునితో చెప్పెను.


అష్టపది 12

 

పశ్యతి దిశి దిశి రహసి భవంతం
తదధర మధుర మధూని పిబంతం
నాధ ! హరే ! జగన్నాధ ! హరే
సీదతి రాధా వాస గృహే  (ధ్రువం)

త్వదభిసరణ రభసేన వలంతీ
పతతి పదాని కియంతీ చలంతీ

విహిత విశద బిస కిసలయ వలయా
జీవతి పరమిహ తవ రతి కలయా

ముహురవలోకిత మండన లీలా
మధురిపు రహమితి భావన శీలా

త్వరితముపైతి న కధమభిసారం
హరిరితి వదతి సఖీ మనువారం

శ్లిష్యతి చుంబతి జల ధర కల్పం
హరిరుపగత ఇతి తిమిరమనల్పం

భవతి విలంబిని విగళిత లజ్జా
విలపతి రోదితి వాసక సజ్జా

శ్రీ జయదేవ కవే రిదముదితం
రసిక జనం తనుతా మతిముదితం

హే నాధా ! హరే ! జగన్నాధ ! పొదరింటిలో రాధ నీకొరకు విరహవేదన చెందుతోంది.  పర స్త్రీల అధరామృతమును రహస్యంగా గ్రహిస్తున్న నీకోసం అన్ని దిక్కులా వెదుకుతున్నది. నీ వద్దకు రావలెనని కోరికతో ముందుకు అడుగులు వేస్తున్నది. నడవలేక, విరహవేదనతో పడిపోతున్నది. లేతవైన తామర తూడుల కంకణములు ధరించి, నీతో ఇంతకు ముందు జరిపిన రతిక్రీడనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఈ అరణ్యంలో జీవిస్తున్నది.

తన అలంకారమును మాటిమాటికి చూచుకుంటూ, తనను తానే కృష్ణునిగా భావిస్తున్నది. సఖిని మాటిమాటికి రతిక్రీడకై హరి ఎందుకు రాలేదని అడుగుతున్నది. చీకటినే హరిగా భావించి కౌగిలించుకొని ముద్దుపెట్టుకుంటున్నది. రాధ నీకోసం ముస్తాబై ఎదురు చూస్తున్నది. నీ రాక ఆలస్యంతో, సిగ్గు విడచి రోదిస్తున్నది.

శ్రీ జయదేవ కవినుండి వెలువడిన ఈ గీతం రసికులకు సంతోషం గలిగించుగాక.

 


శ్లో. విపుల పులక పాళి: స్పీత సీత్కారమంత
 ర్జనిత జడిమ కాకు వ్యాకులం వ్యాహరంతీ
 తవ కితవ విధత్తేఎమంద కందర్ప చింతాం
 రస జల నిధి మగ్నా ధ్యాన లగ్నా మృగాక్షీ

 

ఓ అల్లరివాడా ! మృగనయని రాధ పులకరించిపోతూ సీత్కార శబ్దములు చేస్తున్నది.  జడత్వం వల్ల వికారంతో వ్యాకులత చెందుతోన్నది.  నీతో రతికేళి జరుపుతున్నట్లు గా తలచుచూ రస సంద్రంలో మునుగుతున్నది.

శ్లో. అంగేష్వాభరణం కరోతి బహుశ: పత్రేఎపి సంచారిణీ
 ప్రాప్తం త్వాం పరిశంకతే వితనుతే శయ్యాం చిరం ధ్యాయతి
 ఇత్యాకల్ప వికల్ప తల్పరచనాసంకల్ప లీలా శత
 వ్యాసక్తాఅపి వినా త్వయా వర తనుర్నైషా నిశాం నేష్యతి

రాధ తన అంగములను ఆభరణములతో అలంకరించుకుంటున్నది.  ఆకులు కదిలినా నీవు వచ్చావని అనుకుంటున్నది.  శయన శయ్యను అలంకరిస్తున్నది.  చాలా కోరికతో నిన్ను ధ్యానిస్తున్నది.  నీవు దగ్గరలేక పోవడంతో రత్రి గడవుటలేదు.

శ్లో. కిం విశ్రామ్యసి కృష్ణభోగిభవనే భాండీరభూమీరుహి:
 భ్రాత: ! యాహి న దృష్టి గోచరమిత: సానంద నందాస్పదం
 రాధాయా వచనం తదధ్వగ ముఖాన్నందాంతికే గోపతో
 గోవిందస్య జయంతి సాయమతిధి ప్రాశస్త్య గర్భా గిర:

||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే సోత్కంఠ వైకుంఠ: నామో షష్టస్సర్గ:||

{jcomments on}