ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” eBook

Like-o-Meter
[Total: 0 Average: 0]

నానాటి బ్రతుకు నాటకము

కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము

పొవుటయు నిజము

నట్టనడి నీ పని నాటకము

ఎట్టనేడుటనే గలది ప్రపంచము

కట్టకడపటిది కైవల్యము….

 

బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” చదువుతున్నంతసేపు, వెంటాడే “అన్నమయ్య” పంక్తులు ఇవి. మనిషి ప్రయాణం అనంతం. ఈ పయనంలో గమ్యం ఏమిటనేది ఏదో ఒకనాడు ప్రతి మనిషీ తనకు తాను వేసుకునే ప్రశ్నే! మిగతావారితో పోలిస్తే, కవుల విషయంలో ఈ ప్రశ్న కొద్దిగా తొందరగానే కలుగుతుంది. ఇక, “అసతోమా సద్గమయా” అనే వేదవాక్యానికి అనుగుణంగా నిజమైన కవి ప్రస్థానం మొదలౌతుంది.

 “నేను” తో మొదలయ్యే ప్రశ్నల పరంపర, అస్పష్టమైన భావాల్లో కదలిక తెస్తే, ఆ కదలిక ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. రోజూ చూసే మేఘానికే, ఆకాశం గొడుగు పట్టటం కనిపిస్తుంది. తాకే ప్రతి వాన చినుకు ఇంద్రధనువై పలకరిస్తుంది. జారిపోతున్న నీటికి, మెరుపులతో మేఘాలు వీడ్కోలు ఎలా పలుకుతున్నాయో తెలిసొస్తుంది. చివరికి, ఒకానొక సాయంకాలం చివరి రెమ్మ గాలికి వీడ్కోలు తెలుపుతుంటే తనను తాను గుర్తుపడతాడు కవి.

 కవిత్వమంటే, మౌనానికి ముందుమాట అని “ఆకాశం”లో ఈ కవే అన్నారు. ఆ మౌనానికి మలిపలుకు ఏమిటనేది “ఆరాధన”లో పాఠకులకు తెలిసొస్తుంది. చదివే ప్రతి పాఠకుడిని ఒకానొక గమ్యం దిశగా అడుగులు వేయించే పుస్తకం బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన”.

చక్కటి రచనను పంపి ఈ-పుస్తకంగా ప్రచురించేందుకు అవకాశమిచ్చిన బి.వి.వి. ప్రసాద్‍గారికి మా ధన్యవాదాలు.

’ఆరాధన’ పై ఇస్మాయిల్, సంజీవ్‍ దేవ్ మొదలైనవారి ప్రశంసాపూర్వక ఉత్తరాలు…చదవండి…

 

‘ఆరాధన’ కవిత్వసంపుటి, ప్రసిద్ధుల ఉత్తరాలు

 

 

శుభాభినందనలతో

ఆవకాయ.కామ్