Like-o-Meter
[Total: 0 Average: 0]
“కవిత్వాన్ని నేను కాగితంపైన రాయను…ఏకంగా కాలం పైనే రాస్తాను. కవిత్వానికి ఒక వస్తువునే వేలాడదీయను…ఏకంగా సృష్టి చిత్రాన్నే అంటిస్తాను – అనేదే నా కవితల అంతర్గత భావం.” అని ప్రకటించిన శైలజా మిత్ర గారి సంకలనం “అగ్గిపూలు” ’విజయ నామ సంవత్సర’ ఉగాది కానుకగా మా పాఠకులకు అందిస్తున్నాం.
“మనిషి
చాలా గొప్పవాడు
ప్రపంచాన్నే గెలిచాడు
మరో
మనిషిని తప్ప”
“బస్సులో వెళుతుంటే
చెట్లన్నీ నా వెంటే
దిగగానే
ఎక్కాల్సిన మరో బస్సు కోసం
నేనే ఒక చెట్టునై….”
ఈ “అగ్గిపూల’లో నివురుగప్పిన నిప్పుల్లాంటి మినీ కవితల్లో మనీ వెతల్ని, మనల్ని కలిపి విడదీసే అనుభూతుల్ని ఏర్చికూర్చిన శైలజామిత్ర గారి పలుకుల్ని మీరూ చదవి ఆ ఆలోచనల్లోకి మమేకం కండి!
పాఠకులకు “విజయ”నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో….
మీ
ఆవకాయ.కామ్ బృందం