ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చలం – ఆఖరి ఉత్తరం

Like-o-Meter
[Total: 0 Average: 0]

అరుణాచలంలోని తమ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు వివాదాలకు కేంద్ర బిందువైనట్టి ప్రఖ్యాత రచయిత చలం.
ప్రఖ్యాత విమర్శకులు, రచయిత కూడా అయినట్టి ఆర్.ఎస్. సుదర్శనం ” మళ్ళీ వసంతం” నవలను రాసారు. దానిని చలం గారి అభిప్రాయం కోరుతూ పంపించారు. కొంత కాలం తర్వాత R.S. Sudarsanam – తాను రచించిన మరో నవల ” అసుర సంధ్య” ను పంపించారు.
“అంతటికీ మీ నవల పేరు ఎంతో బావుంది నాకు. ముందు మీరు పంపారు నాకు నవల, దాని కన్న ఇది చాల మెరుగు……….మెంటల్ ఎనాలిసిస్ మీ ఫోర్ట్ …… కొన్ని చోట్ల మీ చర్చలు నాకెంతో ఇష్టమైనాయి. మీరు చాలా విషయాలపైన, దేశ ప్రజల పోకడల పైన చక్కని ఎనలిటికల్ లయిట్ వేస్తోంది, మీరు దేశాన్ని సమగ్రంగా చూసి రాసారు ఈ నవల.”
“చలం గారికి కొంతైనా నచ్చిన నవలను రాయ గలిగానన్న మాట.” అని సంతోషించారు సుదర్శనం గారు.
04-09-1966 లో రాసిన ఈ ఉత్తరం చలం గారు రాసిన ఆఖరి ఉత్తరం – అందువలన సుదర్శనం గారు ఆ జవాబును అందుకున్న అదృష్టవంతులు.