కస్తూరిబాయి (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ మహాత్మునిగా మారడానికి స్ఫూర్తి ఐనదని
చాలా మందికి తెలుసినదే! ఆయన రాజకీయాలను నిర్వహించడంలో గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! తోటి మనుష్యుల ఫీలింగ్సును సైతము బాగా గమనించగల వ్యక్తియే! తన అర్ధాంగి కస్తూర్ బా చిన్న చిన్న కోరికలను కూడా ఆమె నోరు తెరచి అడగకపోయినప్పటికీ’ గుర్తించేవాడు.వీలైనంతవరకు తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నించే వాడు.
కస్తూర్బాకు తన నిత్య కార్యక్రమాలను అక్షరబద్ధం చేయడమునూ, డైరీలు రాసే అలవాటును నేర్పిన వాడు గాంధీయే! కస్తూర్ బా స్వంత వ్యక్తిత్వమును తన ప్రవర్తనలో వ్యక్తీకరిస్తూండేది. బార్డోలీ పోరాటంలో స్వయంగా పాల్గొన్నది. ఆమెకు ‘హిందీ భాష ’ అంత బాగా రాదు.
1931- 1933 ల మధ్య మూడుమార్లు కస్తూర్ బా కారాగారా వాసము చేసినది. కస్తూర్ బా కు “తులసీ రామాయణము” ను సుశీలా నయ్యర్, ప్యారేలాల్ మున్నగు వారు చదివి, వినిపించే వారు. కస్తూర్బా అందరు భక్తుల వలే మూఢ భక్తితో విని ఊరుకునేది కాదు. తులసీ రామాయణ పద్యాలను సునిశితముగా విమర్శించేది. పతిదేవుడు గాంధీజీ ప్రార్ధనానంతరము కస్తూర్బా వద్ద కూర్చుని, ఆమెకు ఆయా శ్లోకముల అర్ధాలను చెబ్తూండే వారు. కస్తూర్బా కొన్ని పద్యాలను వింటూ, “ఇందులో అతిశయోక్తులు ఉన్నవి. ఇది నిజం అవకపోవచ్చును” -ఇలాగ నిష్కర్షగా స్వీయ అభిప్రాయాలను తెలిపేది.
గాంధీజీ ఈ శ్రోత కోసం “సంగ్రహ రామాయణము” ను తయారుచేయాలని అనుకున్నారు. చాలా కృషితో, కస్తూర్బా కోసం కొన్ని శ్లోకములను ఎంపిక చేసారు. అలాగ వాల్మీకి రామాయణములోని రెండు కాండముల వరకు సులభమైన గుజరాతీ భాషలోనికి అనువాదము చేసారు. ప్రతిరోజు సాయంత్రము ప్రార్ధన వేళలో ఆ అనువాదాలను కస్తూర్బా చదువుకోగలదని గాంధీజీ భావన. అలాగ తాను కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి, అనుచరులకు ఇచ్చేవారు ఆయన. ఆ తర్వాత వాటిని ఆయనే చదివి సరిదిద్దుతూండే వారు.
అప్పటికి కస్తూర్ బా శ్వాసకోశ రుగ్మతతో, ఆయాసంతో బాధ పడ్తూండేది. గాంధీజీకి నిరాహార వ్రతాలూ, బ్రిటీష్ ప్రభుత్వముతో చర్చలు, భార్య కస్తూర్బా ఆరోగ్య చింతనలూ, ఆమెకు సేవలు ఇత్యాదులతో ఊపిరి సలుపని పనులు చుట్టుముట్టాయి. దానితో ఆయన కస్తూర్బా కోసం తలపెట్టిన “సంక్షిప్త రామాయణ సంకలనము” కాస్తా రెండు కాండములతో ఆగిపోయినది.
కస్తూర్బా ఆగాఖాన్ పాలెస్ ను చేరారు. పండుగలు, వ్రతాలు, నోములు అన్నింటికీ క్రమం తప్పకుండా ఉపవాసాలను ఆచరించేది. జైలులో ఉన్నప్పుడు ఆమె “ఏకాదశి ఎప్పుడు?” అని అడిగినది. గాంధీజీ సూపర్నెంటును కలిసి“తిథి, వార, నక్షత్రాలను చూపించే కేలండర్ ను మాకు తెప్పించగలరా?” అని అడిగారు. Superintendent “అలాగే! తెప్పిస్తాను” అని సమ్మతిని తెల్పాడు. కానీ బయటనుండీ , అధికారుల పర్మిషన్ తో వస్తువులు లోనికి రావడానికి కొన్ని రోజులు పడ్తుంది. అందుకని గాందీజీ ఆలోచించారు. అనుచరులను పిలిచి కొన్ని సూచనలు ఇస్తూ ఒక కొత్త కేలండరును తయారు చేయ గలిగారు.
అందరికీ జాతిపిత ఎప్పుడు అరెస్టు ఐనారో తెలుసును. ఆ రోజు తిథి, తేదీ అన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఇక ఆ రోజు నుండీ లెక్కిస్తూ వచ్చారు. అలాగ లెక్కిస్తూ, సంవత్సరం కొస వరకూ తిథులను, నక్షత్రములనూ రాశారు. గాంధిమహాత్ముడు ఇచ్చిన సూచనలు అద్భుత ఫలితాలను ఒసగినవి. తిథులు అన్నిటినీ ఎర్ర పెన్సిల్ తో “పౌర్ణమి” వద్ద క్రింది గీతలు వేసారు. అలాగే “అమావాస్య” రోజులకు క్రీగీతలను గీసారు. అలాగ red, blue pencils తో పున్నమి, అమావాస్యలను underline చేయడంతో నవీన పంచాంగ కేలండర్ నిర్మాణం పని సులువు ఐనది.
ఇక ఆనాటి నుంచీ కస్తూరి బాయికి, తక్కిన వారికీ “ఏకాదశి ఫలానా రోజున వస్తుంది. అట్లాగే తక్కిన ఉపవాసములు, నోముల పండుగల టైములను – ” అడిగిన వారికీ మహాత్మా చెప్పేవారు. అటు పిమ్మట కొన్ని రోజులకు సిబ్బంది తెప్పించిన calender కూడా వారి చేతిలోనికి వచ్చిందనుకోండి. ఐతే సంక్షిప్త రామాయణ సంకలనము, కేలండరు సిద్ధపరచిన వైనమూ, వారి అనురాగానికి తీపి గురుతులు.
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>