ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గిడుగు రామ్మూర్తి పంతులు – సవర జాతి చారిత్రక అంశాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

పర్లాకిమిడిలో ఉన్న గిడుగు రామ్మూర్తి పంతులు మొదట ఒరియా భాషను నేర్వాల్సి వచ్చినది. ఒరిస్సాలో విద్య, అక్షరాస్యతలో వెనుకబడిఉన్నది, టీచర్లు కూడా తక్కువ మంది. ఫలితంగా:-  ఓఢ్రులకు కూడా తెలుగు ఉపాధ్యాయులే బోధన చేయాల్సి వచ్చేది. గిడుగు రామ్మూర్తి పంతుల శిష్యులైన బురా శేషగిరి రావు “1890 లలోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు  – సవరల పాఠశాల ను ఆరంభించారు.” అని పేర్కొన్నారు.

గిడుగు రామ్మూర్తి పంతులు కూడా ఒరియా ను నేర్వక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఒక పానో తో పరిచయం ఏర్పడినది. అతని పేరు “తౌడు”. తౌడు మాతృభాష ఒరియా, కానీ సవరల భాష కూడా తెలుసును. గిడుగు రామ్మూర్తి పంతులు ఇంటికి వచ్చి, రెండు భాషలనూ నేర్పే వాడు.

1894 నాటికి గిడుగు రామ్మూర్తి పంతులు  గారికి సవర భాష పట్టుబడింది. సవర భాషకు  లిపి లేదు, అందుచేత తెలుగు అక్షరాలలోనే సవర
భాషలోని పాటలను, కథలూ, గాథలనూ రాసుకునే వారు.కొత్తగా స్కూలులో చేరిన విద్యార్ధికి మల్లే – గిడుగు రామ్మూర్తి పంతులు  సవర భాషను, వారి నిత్య జీవిత విధానాలనూ కూడా పరిశీలించారు.

సవర చారిత్రక అంశాలను కూడా అనుకోకుండా ఆ వరుస క్రమంలో తెలుసుకున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు తన అధ్యనాంశాలను విజయనగరములోని విద్యావేత్తలకూ, మిత్రులకూ చదివి వినిపించారు.అటు తర్వాత గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యాసాన్ని“మద్రాసు లిటరరీ సొసైటీ వారి జర్నల్”లో ప్రచురిచారు.

గిడుగు రామ్మూర్తి పంతులు  కృషితో సవరల జాతి ప్రాచీనమైనదనీ వెల్లడి ఐనది. సవరల ప్రస్తావన ఋగ్వేదములో ఉన్నది. తమిళ నాడులో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో కోండ్లు గిరిజనులు ఎక్కవ. వారి తర్వాత ద్వితీయ స్థానంలో సవరలు ఉన్నారు.

మద్రాసు(నేటి చెన్నై) రాజధానిలో 64 రకముల ఆదిమ జాతి తెగలు ఉండే వారు. ఋగ్వేదములోనూ, గ్రీకు, రోమన్ మేధావులైన టోలమీ, ప్లీనీ మున్నగు వారి రచనలలోభాషకు సవరల గురించి ప్రస్తావించారు. ఇట్టి బలమైన విశేషాలతో నిరూపణలు, ఉపపత్తులనూ చూపి, గిడుగు రామ్మూర్తి పంతులు సవర జాతీయులకూ, సవర భాషకూ గల ప్రాచీనతను సోపపత్తికముగా ఋజువు చేసారు.

సవరల గ్రామ పెద్దలు గోమాంగ్ బుయాలు. [ఒక తెలుగు సినిమాలో “గోమాంగో!…” అని వినిపించింది కూడాను, మూవీ పేరు గుర్తు లేదు.]. గోమాంగ్ బుయాల సహకారంతో  గిరిజనులను చదువు పట్ల ఆకర్షించగలుగుతామని గిడుగు రామ్మూర్తి పంతులు  చెప్పారు. ఆర్యుల రాక వలన, ఆర్య నాగరికత విజృంభణ వలన నాటి సమాజంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా తమ భాషా సంస్కృతుల పట్ల మమకారం ఉన్న వారు తమ సర్వ శక్తులనూ ధారపోసి కాలానికి ఎదురీదారనేది చేదు నిజం. అడవులలోనికీ, కొండ కోనలలోనికీ వెళ్ళితమ ఆచార సంప్రదాయాలను కాపాడుకున్నారు. ఇలాగ గిరిజనులుగా నిలద్రొక్కుకున్న ఇలాంటి కొండ జాతులలో సవరలు కూడా ఒకరు.

ఫలితంగా వారి చారిత్రక సంపదగా వారి జీవన విధాన విలక్షణతలు నేడు, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వారి కృషి వలన లోకానికి వెల్లడి ఐనాయి.

Max Muller, Sayce మున్నగు భాషా తత్వ వేత్తలు రచించిన essay లనూ, రచనలనూ ఆసక్తితో చదివే వారు. గిడుగు రామ్మూర్తి పంతులు 1892 నుండీగిరిజనుల భాషల పట్ల ఆసక్తితో అధ్యయనం చేయ మొదలిడినారు. “సవరల భాష” ను నేర్చుకోవడానికి నాంది పలికారు. అసలు లిపియే లేని మారు మూల అడవులలోనిజనుల భాషను పరిచయం చేసుకోవడమంటే మాటలా? ఆ నాటి సంఘంలో ఇలాంటి ప్రయత్నమంటే అర్ధము -కట్టుబాట్లను ఎదిరించడమే!!