ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

హ్యాపీ బర్త్ డే టు యు – మిల్డ్రెడ్ జె.హిల్

Like-o-Meter
[Total: 0 Average: 0]

మూడు ఇంగ్లీషు పాటలు గిన్నీస్ రికార్డుల గద్దెను అధిరోహించినవి. అవి ఏమిటి? సింహావలోకనము చేద్దామా!?
 
 
అమితంగా పాప్యులర్ ఐన ఆ పాటలు ఇవి:
1) “Happy Birth Day to you! Happy Birth Day to you!”
2) Auld Lang Syne’;
3) ‘For He’s a Jolly Good Fellow.’
 
 
మ్యూజికాలజిస్ట్ ఐన మిల్ డ్రెడ్ కంపోజ్ చేసిన “హ్యాపీ బర్త్ డే టు యు” పాట, పుట్టినరోజు నాడు జేజేలు పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఆత్మీయతల కలబోతల శుభాకాంక్షలను ఈనాటికీ పంచిపెడ్తూనే ఉన్నది.
 
మిల్డ్రెడ్ జె.హిల్ (1855 – 1916)లో లూస్ విల్లె లో జూన్ 27, 1855 జన్మించింది. ఆమె చెల్లెలు ప్యాటీ స్మిత్ హిల్. ప్యాటీ హిల్ పాటను రాస్తే, మిల్ డ్రెడ్ దానికి ట్యూను కట్టినది. ఆ మ్యూజిక్ తమాషా అంతా 1893 లో జరిగింది.
 
“Good morning to all” అనే ఆ పాటను తర్వాత ప్యాటీ హిల్ పుస్తకమును  ప్రింట్ చేసి అందులో చేర్చినది. “Childrean’s songs”  లో చేర్చింది ప్యాటీ హిల్. ప్రతిరోజూ విద్యార్ధులు ఈ పాటను పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత అదే ట్యూనుతో “జన్మ దిన శుభాకాంక్షలు”  చెప్పే పాటను తమ టీచరుసహకారముతో కూర్చారు! అదే “హ్యాపీ బర్త్ డే టూ యూ!”
ఆ క్షణాన తమ గళములను కలిపిన ఆ చిన్నారి చిట్టి పాట భావి కాలాన అనంత ప్రజాదరణను గడిస్తుందని ఆ రోజు అక్కడ ఉన్న వారు అనుకుని ఉండరు.
 

ఒక నెల ఆలస్యంగానైనా హ్యాపీ బర్త్ డే సృష్టికర్తకు బిలేటెడ్ బర్త్ డే విషెశ్ చెబుదామా….హ్యాపీ బర్త్ డే టు యూ మిల్డ్రెడ్! హ్యాపీ బర్త్ డే టు యూ”

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>