“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో”
శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది.
నా చిన్నప్పుడు “ఆర్నికా హైర్ ఆయిలు” తరచూ ప్రకటనలలో కనబడేది. ఆ నూనెను కురుల కోసం స్పెషల్ గా తెప్పించుకునే వాళ్ళు. టిబెట్ దేశ శిల్పి పేరు ఇట్లాంటిదే! అరానికో/ అనికో/ అనిగే అని స్థానిక ప్రజల గౌరవాన్ని పొందిన చారిత్రక వ్యక్తి అతను. 2] బీజింగ్ లో మియాయింగ్ కోవెల వద్ద ఈతని విగ్రహం ఉన్నది.(Araniko, Miaoying Temple, Beijing) కళాజగతినందు ఆదాన ప్రదానాలు సాధారణం
॑॑॑॑॑#####
అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆర్నికో. నియమనిష్ఠలతో ఆ మహత్కార్యాన్ని పూర్తి చేసాడు.
యువాన్ వంశ పాలనకు ఆద్యుడైన కుబ్లైఖాన్ నేపాల్, టిబెట్ చిత్ర, శిల్ప కళలను గాంచి ముగ్ధుడు ఐనాడు. మల్ల ప్రభువులను ‘మహాశిల్పి ఆర్నికోని మా సీమకు పంపించండి, ఆతని ద్వారా నవీన శిల్పరీతులను మా ప్రాంతాలలో ఆవిష్కరణలు చేయాలని మా ఆకాంక్ష.’ అని కుబ్లైఖాన్ కోరాడు. అందుకు మల్ల చక్రవర్తులు, ఆనికో సంతోషంతో సమ్మతించారు.
ప్రభువుల అనుజ్ఞతో అనికో చైనాకు వెళ్ళాడు.
మంగోలు సామ్రాజ్యములోని స్థిరకళలకు అదనపు సొగసులను అందించి, చైతన్యాన్ని నింపాడు అనికో.
అమరశిల్పి జక్కన, రువారి మల్లిటమ్మల వలె – ఆరణికో మధ్య, దక్షిణ ఆసియా ఖండ దేశాల కళలకు ఒరవడి పెట్టాడు. నేపాల్, టిబెట్, యువాన్ చీనా మొదలగు దేశాలలో నేటికీ ఆరణికో కళారీతుల ప్రభావం అనుసరణలో ఉన్నదంటే ‘అతను నెలకొల్పిన సరి క్రొత్త విధానాలూ అద్భుతమైనవి అని ఋజువు ఔతూన్నవి.
#####
కళాజగతినందు ఆదాన ప్రదానాలు సాధారణం. అభయ మల్ల, జయభీమ్ దేవ్ మల్ల పరిపాలనాకాలమున కళా మార్పిడి కార్యక్రమాలు చురుకుగా సాగినవి. కుబైఖాన్ హిమాలయ కళాపద్ధతులను(trans-Himalayan artistic tradition), చీనా కళల సమ్మిళితమైన నవ్యత్వానికి శ్రీకారం చుట్టాడు. ఇట్టి స్థిరకళల మార్పిడి వలన చైనా సమాజానికి అమోఘ సౌందర్య ఆవిష్కరణలు లభించినవి. ఫలితంగా అక్కడ వర్ణమయ సృజనాత్మకలు వెల్లివిరిసినవి.
#####
ఆర్నికో (అర్నికో) తాత, నాయనమ్మలు మిత్ర, కుందలక్ష్మి. చైనా చారిత్రక ఆధారముల ప్రకారము (ఉచ్ఛారణా పరిణామములో) “మి-తి-ర”, “కున్-ది-ల-క్విమెయి” అని మారినవి. తల్లిదండ్రులు “ల-కె-న”, “షు-మ-కె-తై”(లక్ష్మణ్, సుమకేతి). విజేతల జీవితాలలోని ముఖ్య సంఘటనలను జనులు పదేపదే చేసుకుంటూంటారు. తద్వారా తర్వాతి తరములకు కొన్ని కథలు ఆశువుగానూ, పాటలుగానూ, సాహిత్యరూపేణా నిధులు దొరుకుతూన్నవి.
ఆర్నికోకు ప్రజలచేత నెమరు వేయబడేటటువంటి అలాంటి స్మృతులు ఉన్నవి.
తండ్రి బౌద్ధ కోవెలకు బాలుడు ఆర్నికోతో వెళ్ళాడు. మూడేళ్ళ బాల ఆర్నికో, తండ్రిని కొన్ని సందేహాలను అడిగాడు. “ఈ స్తంభములను ఎవరు చెక్కారు? వీని పునాదులను, పైన ‘అండా” లను ఎవరు నిర్మించారు?” (wooden sthambha, bhumis, anda)
మూడేళ్ళ చిన్నారి ప్రశ్నలు పెద్దల మేధావితనానికి దీటుగా ఉన్నవి.
అందరూ “ఆనికో గొప్ప శిల్పి ఔతాడు. భవిష్యత్తులో అతడు పేరు ప్రఖ్యాతులను ఆర్జించి, గొప్పవాడౌతాడు.” అని అనుకున్నారు. వాళ్ళ నమ్మకం, పలుకులు వాస్తవం అయినవి.
బీజింగ్, నేపాల్ లోని నేపాల్ కీర్తిపూర్ మున్నగుప్రాంతాలలో అతని ప్రతిమలను ప్రజలు స్థాపించుకున్నారు.
#####
పగోడా, డగోబాల తేడా:
డగోబాలు ‘గంట ఆకారముతో ఉంటాయి. డగోబాలు నిర్మాణశైలికి ‘మన దేశములోని స్థూపము మంచి ఉదాహరణ. శ్రీలంక (పాత పేరు సింహళము), థాయిలాండ్, కొరియా మొదలైన దేశాలలో సాక్షాత్కరిస్తున్నవి. బౌద్ధ పరివ్రాజకులకు, బౌద్ధ సన్యాసులకు ధ్యానప్రదేశాలుగా ఉపయోగము కలిగినవి.బుద్ధదేవుని చైత్య, ఆరామాల శైలులు వర్ణచిత్రాలను, పుష్పములు, జంతువులు ప్రతీకలుగా ఉన్నవి. ఏనుగులు, ఫలములు, జంతు, వృక్షములు డిజైన్లతో, ఎంబ్రాయిడరీ తీరుతెన్నులై, ఆకట్టుకుంటూంటాయి. హిందూ శిల్పములు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు, మనుష్యులు, సైనికులు, యోధుల సాహసాలు, గజ, శరభ, సింహాది క్రూర మృగాలను వేటాడే దృశ్యాలు అనేక ఉన్నవి. ఇవి కథాకథనశైలికి ప్రతిబింబాలు. ఆ స్త్రీలు, రామచిలుకలు, మయూరి మున్నగు పెంపుడు పక్షులతో వయ్యారమొలికించే వనితామణులు అలనాటి ప్రజాజీవనవిధానాలను కన్నులకు బొమ్మలు కట్టినట్లు ఉండే విధానము నెలకొన్నది. హంపీలో మహిళల హెయిర్ స్టైల్సు సంఖ్యాపరంగా, వివరణాపరంగా ‘న భూతో న భవిష్యతి|’.
నాటివరకూ మనుజుల సంగీత, నాట్యాది లలితకళలను, నిత్య జీవనశైలిని, వీరుల యుద్ధవిధానాలనూ (మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో సుప్రసిద్ధమైనది. చంద్రవంశ రాజైన చండేల ప్రభువులు కొన్ని అడుగులు ముందుకు వేసారు. వారు వాత్స్యాయన కామసూత్రాలను శిల్పములుగా చెక్కించి, ప్రపంచములోని ఇతరదేశాలకు, పాశ్చాత్యులకూ పరిశోధనలకు కేంద్రమైనది.) గ్రీకులు, కుషాణులు, కనిష్క చక్రవర్తి, మొదలైన వారి ప్రభావముచే “గాంధారశైలి” మన దేశానికి లభించినది. అట్లాగే బౌద్ధులు, జైనులు మున్నగువారివలన “ప్రతీక శైలి”ని లబ్ధిగా హిందువులు పొందారు.
ఈ మార్గమున దృశ్యకళలైన చిత్రలేఖనములు, కుడ్యచిత్రాలు, మురల్ శైలి, ఫ్రెస్కో కళ, అదే తీరుగా ‘డగోబా’ ఆరాధనామందిరములు మన దేశానికి అందిపువచ్చిన కళా విన్నాణాలు.
#####
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>