ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు “యతి”. మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి?
ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. “యతి” అంటే హిమాద్రి శిఖరములలో తారట్లాడుతూ ఉండే ఆదిమ వానరము. ఇది మనిషికి పూర్వము ఉన్న గొరిల్లా. యతి అప్పుడప్పుడూ హిమాలయాలలో నడిచి వెళ్ళే వారికి కనపడుతూండేది. భారీ ఆకారము, అతి పెద్ద కాలిముద్రలు సాక్ష్యాలుగా చెబుతారు. ఇట్టే కనిపించి చిటికలో మాయమయ్యే “YETI” అనేక ఊహాగానాలను ప్రోది చేసింది. తద్వారా అనేక ఫిక్షన్ నవలలు, సైన్సు కథలూ, రచనలూ, ఫిల్మ్లూ వచ్చాయి.
ఈ హిమ మానవుడు హీరోగానూ, విలన్ గానూ సాహిత్యములో వెలిసాడు. కథతో సినిమాలను కూడా తీసారు. 1957
“ది అబోనిమల్ స్నో మాన్” (“The Abominable Snowman”) అనే చలనచిత్రం 1957 లలో వచ్చింది.
**************
బాల జగత్తుకు సరి కొత్త ప్రపంచాన్ని అందించిన మేధావి వాల్ట్ డిస్నీ. ఆతని డిస్నీ లాండ్ లోకవిఖ్యాతమైనది. వాల్ట్ డిస్నీ దృష్టిని ఆకర్షించింది కైలాస పర్వతమైన హిమాలయ పర్వతములు. వాల్ట్ డిస్నీ అద్భుత సృజనాత్మక దృశ్యాలలో “హిమాలయ శిఖరము” ఒకటి. ప్రపంచములో ఎత్తైన పర్వత శిఖరములు హిమాలయాలు. దీని నిర్మాణ దక్షత అతనికే చెల్లింది.
“హిమాలయ ఎక్స్ పెడిషన్”; ది టెంపుల్ డు పెరిల్ – రోలర్ కోస్టర్ లను తయారీలో అనేకమంది టెక్నీషియన్ లూ, శిల్పకళాకారులూ, డిస్నీ ప్రత్యేక శ్రద్ధ మూలస్తంభాలు. ఆసియా విభాగంలో “హిమాద్రి ని సృజించాడు. దీని నిర్మాణానికై కోట్ల డాలర్లను వెచ్చించేందుకు వెనుకాడ లేదు. 2006 లో నెలకొల్పిన ఈ Mount Everest; మౌంట్ ఎవరెస్ట్ లో అదనపు అట్రాక్షన్ “యతి”.
డిస్నీలాండ్ లోని ఆసియా విభాగములో హిమాలయాలు, యతి ముఖమైనవి. ప్రధానమైనది. వాల్ట్ డిస్నీ ఈ హిమ
హిమాలయ పర్వతాలను కాపలా కాస్తుంది “బృహదాకార మంచు మనిషి. అతనే “యతి” (“Yeti”). ఇది కాకలు తీరిన ఇంజనీర్లు 6 సంవత్సరములు చేసిన నిరంతర కృషి ఫలితము. డిస్నీ జంతు ప్రపంచము (Disney Animal Kingdom) ప్రపంచంలోని ఆబాలగోపాలానికీ ప్రధాన ఆకర్షణ.
{jcomments on}