ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పాశ్చాత్య శిష్యుడు-పంతులుగారి వాత్సల్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

వ్యావహారిక భాషా ఉద్యమము ప్రచారం చేసి, కళాప్రపూర్ణ గా శ్లాఘించబడిన వ్యక్తి  గిడుగు రామ్మూర్తి పంతులు గారు. నేడు వ్యావహారిక భాష – మన రచనా, విద్యా రంగాలలో ఆచరణలో ఉండటానికి కారణము గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన 1892 నుండీ గిరిజనుల  భాషల పట్ల ఆసక్తితో అధ్యయనం చేయ మొదలిడినారు.

జె.ఎ. ఏట్స్(J.A.Yates) అనే ఇంగ్లీష్ ఉద్యోగి తెలుగును, స్థానిక ప్రజల మౌఖిక భాషలను నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు గిడుగు “సవరల భాష” ను నేర్చుకోవడానికి నాంది పలికారు.

 
దక్షిణ ముండా భాషా వర్గమునకు చెందినది సవరల భాష. ఐతరేయ బ్రాహ్మణములో “శబరులు” అనే మూల పురుషులు కల జాతి వారు వీరు – అని ఋజువులతో నిరూపించారు గిడుగు. వారి అకుంఠిత దీక్షకు ఇవి నిదర్శనాలు.
 
ప్రభుత్వము తోడ్పాటు లేకపోయినా, రామ్మూర్తి గారు స్వంత డబ్బుతోనే సవరల విద్యాభివృద్ధికై, బడి పెట్టించారు. గిడుగు రామ్మూర్తి పంతులు నిష్కామ పరిశ్రమను ప్రజలు గుర్తించారు. వారి తోడ్పాటుతో , జనులు ఇచ్చిన విరాళాలతో, సవరల బడులకు 1905 – 06 ల నాటికి, అప్పటికి గ్రాంటులతో, ఆ స్కూళ్ళు స్థిరత్వం ఆర్జించాయి.
 
గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి వెలుగులోనికి రావడానికి కారణమైన వాడు ఒక పాశ్చాత్య దేశస్థుడు, అతని పేరు వాల్ష్ మన్.
 
1908 లో Welshman అటవీశాఖాధికారిగా వచ్చాడు.  “మీకు తగిన డబ్బును ప్రతిఫలంగా ఇస్తాను; నా బంగళాకు వచ్చి, సవర భాషను నేర్పు”మన్నాడు అతడు. కానీ అప్పటికే, అనేక కార్యక్రమాలతో తలమునకలై ఉన్నగిడుగు రామ మూర్తి  “నేను మీ ఇంటికి వచ్చి, చెప్పే తీరిక లేదు. నాకు పారితోషికము అక్కర్లేదు. శ్రద్ధగా నేర్చుకోవడమే మీరు నాకిచ్చే జీతంగా భావిస్తాను. మా కాలేజీలో మధ్యాహ్న వేళ, విరామ సమయాన మీరు వస్తే , మీకు తప్పకుండా నేర్పిస్తాను”  అని ప్రత్యుత్తరమునిచ్చారు.
 
అలాగ పుల్ల విరుపు మాటలతో జవాబు వస్తుందని ఊహించలేదు వాల్ష్మ్యాన్. 

” గిడుగు అహంకారి” అని మొదట్లో భావించినా, ఆ తర్వాత “సమంజసమే!”- అని అర్ధం చేసుకున్నాడు వాల్ష్మన్.

ఆ ఐరోపా వాసి,  రామ మూర్తి బహుముఖీన ప్రజ్ఞా పాండిత్యాలను గుర్తించి, ఆయనకు వినమ్ర శిష్యునిగా మారాడు. వెల్ష్ మన్ కు 1911 లలో కుమార్తె పుట్టినది. ఆ తర్వాత స్వదేశానికి వెళ్ళి పోయాడువెల్ష్ మన్ .

 
“గిడుగు రామమూర్తి ఎంతో ప్రతిభా పాటవాలను కలిగిన వ్యక్తి. ప్రతి ఫలాపేక్ష ఎరుగని సేవామూర్తి ఆయన.  అలాంటి మేధావిని గుర్తించి, గౌరవించ లేని అలసత్వము అధికారులలో ఉన్నది. ” అంటూ మందలిస్తూ, వివరించాడు వాల్ష్ మాన్.
 
అలాగ ప్రభుత్వం కళ్ళు తెరిపించిన ఉన్నత గుణశాలి ఆ పాశ్చాత్యుడు. జిల్లా కలెక్టరు మెక్ మైఖేల్ ఆతడు మందలించగనే ప్రతిస్పందించాడు. రామ మూర్తి గారు రచించిన వ్రాత ప్రతులను అన్నింటినీ తెప్పించారు.
 
వాటిని చదివించి, విని, అవి ఎంతో అమూల్యమైనవి- అని గ్రహించారు. అలాగ పంతులు గారి అమూల్య గ్రంధాలు , కొన్ని పుస్తకములు  ముద్రణా భాగ్యానికి నోచుకున్నాయి. అవి:
 
1) సవర డైలాగ్స్ – 1912
 
 2) సవర సాంగ్స్ (1913)  
 
3) సవర రీడర్ (1914)
 
 4) సవర తెలుగు నిఘంటువు

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>