ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

The Circus Tree

Like-o-Meter
[Total: 1 Average: 4]

Robert Ripley’s ” Believe It or Not! “ప్రేక్షకులకు అమిత   ఇష్టమైన Telivision కార్యక్రమము. రాబర్ట్ రిప్లీ ప్రసారం చేసే ఈ – “నమ్ము! నమ్మక పో” అనే ప్రోగ్రాములో 12  సార్లు ప్రసారమైన విశిష్టతను కలిగిన విశేషం ఏమిటో తెలుసా?అదే – “సర్కస్ తోట”.ఆక్సెల్ ఎరాల్డ్సన్  అనే స్వీడిష్ అమెరికన్ స్వతహాగా వృక్ష తత్వాల పట్ల ఏర్పడిన అభిరుచితో, చెట్ల పెంపకములో వినూత్న పద్ధతులను అభివృద్ధి పరిచాడు. అక్సెల్ ఎర్లాండ్సన్ పెంచిన తోటలను “న భూతో న భవిష్యతి” అన్న చందంగా వృద్ధి చేసాడు.

ఆతని వనాలు, sculpting trees, The Circus Tree ను గనుక శ్రీకృష్ణుడు, వ్రేపల్లె వాసులు చూసి ఉంటే, తప్పక వీనినే నమూనాగా పరిగ్రహించే వారు. అక్సెల్ ఎర్లాండ్సన్  నాలుగవ గ్రేడ్ లోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు

Axel Erlandson (December 15, 1884 – April 28, 1964).  కేవలం ఆతని స్వయంకృషి , అనేక రంగాలలో ప్రావీణ్యుడు అయేలా చేసినది. సివిల్ ఇంజనీర్  గానూ, మ్యుజీషియన్ గానూ, నర్సరీ మ్యాన్ గానూ, హార్టికల్చరిస్టుగానూ, స్వీయ ప్రతిభతో సర్వేయర్ గానూ – ఇలాగ ఒకటేమిటి? అనేక రంగాలలో నిష్ణాతుడు ఐనాడు

Pruning, grafting and bending  మున్నగు  పద్ధతులను ఆతడు అనుసరించాడు.చెట్లను మైనపు బొమ్మలలాగా మనిషి తనకు నచ్చిన ఆకారములో మలచుకునే విద్యను ప్రపంచానికి చూపి,అబ్బురపరచిన గొప్ప రైతు Axel Erlandson.

హార్టికల్చర్ నుకూడా – ప్రత్యేక ఆకర్షణగా, ఎక్స్కర్షన్, ఎగ్జిబిషన్ , మ్యూజియంలకు వలెనే – వృక్ష, వన సంపదలను కూడా ప్రత్యేక ఆసక్తిని మనుష్యులలో కలిగి, సందర్శకులు పదే పదే వీక్షించడానికి వచ్చే అంశంగా మలచిన ఘనత ఆతనిదే!సరదాగా మొదలైన తరు సంపద పట్ల  కర్షక మహర్షి అభిరుచి, హాబీ ప్రపంచ హరిత వర్ణ ప్రేమికులకు మాత్రమే కాక – కర్షక లోకానికి కూడా మార్గదర్శి అనడంలో ఎంతమాత్రమూ సందేహమక్కర్లేదు.

 

 

“See the World’s Strangest Trees Here,” and named “The Tree Circus.”