ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వీర సావర్కర్ – నాలుగు ఎకరాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో పోరాడిన విప్లవకారులలో శ్రీ వినాయక దామోదర్ సావర్కర్ సుప్రసిద్ధుడు.

చాలా సంవత్సరాలు అండమాన్ ద్వీపంలో కఠిన జైలు శిక్షను కూడా అనుభవించాడు.

ఆ రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వం విప్లవకారులను బంధించిన తర్వాత వారివారి ఆస్తులను జప్తు చేసేది. ఆవిధంగానే సావర్కర్ ఆస్తులని, వ్యవసాయ భూమిని కూడా బ్రిటీష్ ప్రభుత్వం జప్తు చేసింది.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశభక్తుల, విప్లవకారులకు చెందిన ఆస్తులను కాంగ్రెసు ప్రభుత్వం ఇవ్వటం జరుగుతున్నది. కానీ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన కారణంగా సావర్కర్ ఆస్తులని, భూములని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది.

ఈ విషయం ఒక మిత్రుని ద్వారా తెలుసుకున్న సావర్కర్ “భారతదేశమే నాదైనప్పుడు, అందులో నాలుగు ఎకరాలు నావి కాకపోయినా ఫర్వాలేదులే” అన్నాడు.

చూశారా, నిజమైన దేశభక్తుల వైరాగ్యం? ఈ కాలంలో కలికానిక్కూడా ఇలాంటివారు కనబడ్తారా?

pay per click