ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మాఘ మాసం అమోఘ హాసం !!

Like-o-Meter
[Total: 0 Average: 0]

అనఘా అని పిలవబడే జనులు తక్కువైన కాలంలో సైతం 

ఘనమెక్కడా తగ్గని రీతిలో సాగుతోంది ఋతువుల యానం 

చెట్టు చేమ, రాయి రప్ప, గాలి వాన, ఎండా చలి, రేయి పగలు 

పురుగు పుట్రా, నీరు నిప్పు, నింగి నేలా, మార్చుకోవు వాటి నైజాలు

 

నైజం మార్చుకొంటూ నిజానికి దూరమౌతూ 

నేడు గడిస్తే మరునాడు వస్తుందని తలస్తూ 

కాలాన్ని మారని ఒక కొలమానంగా  చూస్తూ 

రోజులు గడిపేసే మనిషికి మాఘం  కాదు అమోఘం!

 

మానవ చరిత్ర లో కాల ప్రతిభ జాస్తి 

ఆమాటకొస్తే కాలమే మనం వెతికే అతీతమైన శక్తి 

యుక్తి తో జీవించే వారికి కాలమే దైవం 

కుయుక్తి తో సహవాసం మొదటికే మోసం 

 

గడచిన ప్రతి రోజూ ఆ దేవుని అనుగ్రహం 

గడిపే ప్రతి క్షణం దైవం తో ఉపవాసం 

రాబోయే కాలం దైవం యొక్క ప్రసాదం 

కాలమే జీవికి పరమాత్మఇచ్చిన ప్రాసాదం !!

 

దేశకాల సంకీర్తనలో కవిత్వం దైవత్వం

సమ్మిళితమై జీవికి అందించును తత్వం

దైవాన్ని నమ్మి చెడిన వారు లేరు అనే నిజం

ఎప్పటికీ నిలచిపోయే ఒక అమోఘ సత్యం

 

మాఘం గడిస్తే ఫాల్గుణం

 

ఎవరూ ఆపలేని చక్రభ్రమణం  

ఓకాలమా! నీకు నా నమస్కారం 

నీ ఎరుకే నాకు గొప్ప పురస్కారం