ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అడవి కాచిన వెన్నల

Like-o-Meter
[Total: 0 Average: 0]

వెన్నెలకు స్పందిచే సత్తా మాకే ఉందని విర్రవీగి

అడవి కాచిన వెన్నల “వృధాకు” ప్రతీకని ఏదో వాగి 

చెట్లను కొట్టి, చెరువులు పూడ్చి, సిమెంటు అడవిలో దాగి

చందమామను  చూడడానికే వీలులేని ఇంటిని కలిగి

తీరికలేని ఉద్యోగం తో వెన్నువిరిగి తలతిరిగి 

వేసారి అలసి సొలసి పోయిన పట్టణ జీవి 

నీకంటే సంతోషం గానే ఉందోయ్ అడవిలోని అతి చిన్న జీవి

 

హైవే మీడియన్ లో పూల మొక్కలు చూసి పొంగిపోతే

అదే ఒక అడవి అని భ్రమిస్తే కావచ్చుఅదీ ఒక కవితే !

తేడా మనుషుల్లో ఉంది, అడవి లో కాదు 

చెత్తను పోగేసే దుష్కృతిలో ఉంది, సెలయేరులో కాదు 

 

వెన్నెల్లో ఆటలు అంగడి లో దొరకునేమో?

చందమామ చూడని బాల్యాలు తిరిగి రాని గతాలు 

ప్రకృతికి కి దూరమై వికృతి గా మారిన 

మానవ జాతి చరితకు తార్కాణాలు!

@@@@@