ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంబులెన్సు లో మరణం

Like-o-Meter
[Total: 0 Average: 0]

 చావుకి దగ్గరౌతుంటే
నన్ను ఎత్తి అంబులెన్సులో పడుకోబెట్టారు
అంబులెన్సు సీలింగ్ చూస్తూ చనిపోయా
అయ్యో ఖర్మ “నారాయణ” అని అనలేదే!!
 
చచ్చిన 11 రోజుల వరకు ప్రేతాత్మ చచ్చిన చోటే ఉంటుంది గా
నేను ఆ అంబులెన్సు లోనే ఉండిపోయా 11 రోజులు
మొత్తం మూడు మరణాలు చూసా
మేము ఇప్పుడు నాలుగు ప్రేతాలం ఒకే అంబులెన్సులో
 
చిత్రం జరిగింది ఒక  రోజు
నన్ను చూసాడు ఒకడు
చేతులూపాడు చావు తెలివేమో
కాని చావలేదు వాడు
 
ఇంకోరోజు ఒకావిడ నన్ను చూసింది
చాల భయపడింది
చావు అంచున ఉన్నదేమో
చచ్చిందో లేదో తెలియదు
 
పదకొండో రోజు మేము నలుగురం ఉన్నాం
ఒకణ్ణి ఎక్కించారు వాడు మానలుగుర్నీ చూసేసాడు 
అంతలో నా టైం అయిపొయింది 
వాడేమయ్యాడో  తెలియదు