ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అర్థరాత్రి స్వతంత్రం

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎంత గుహ్యం ఎంత మృగ్యం
ఎంత చోద్యం ఎంత ఎంత చిత్రం
అంతా కొందరి కోసం
అరవైమూడు వసంతాల నిరీక్షణం
 
ఇప్పటికింకా సాగునీరు లేని భూములు
త్రాగు నీరు కోసం దూరాలకు నడకలు
పట్టణాలలో పేదల ఇలాకాల్లో  కుళాయిల వద్ద  గొడవలు
రహదారిపై మురుగునీటి ప్రవాహాలు
రోడ్డుకు ఇరుపక్కల మల మూత్ర విసర్జనలు
బడుగుల కోసం బడుగు స్థాయిలో ప్రభుత్వ బడులు

ఉదయాన్నే పట్టించుకోని చెత్త కుండీలలోనుంచి వచ్చే దుర్గంధం
సందులలో పందులు వీధులలో పోరంబోకు జంతువులూ
గల్లీలలో అర్థ నగ్న బాలల ఆటలు
తెల్ల దుస్తులలో దాగిన చురకత్తులు రాక్షసత్వం
ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అరాచకాలు అన్యాయాలు
భారతదేశం లో ఇంకా పదిలంగానే ఉన్నాయి
అర్ధరాత్రి వచ్చిన స్వతంత్రం పై సూర్య కాంతి ఇంకా పడలేదు
ఔనులే ఇంకా కారెంటు కోతలు పోలేదు
వర్షం వస్తే చీకటే లేదా తీగ తెగి విద్యుద్ఘాతమే
ఇది మన 63 ఏళ్ల స్వాతంత్ర్య ఫలం