Like-o-Meter
[Total: 0 Average: 0]
నా చిలిపి చేష్టలతో దాక్కొని
నిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,
నీ “లోపలి” మనిషిని చూసి నివ్వెరపోయాను…..
నీ మాటలు బూటకమని ,
నీ ప్రమాణాలు నాటకమని ,
నీవు ధనదాహానికి బానిసవని ,
నీవు కర్కోటక కామపిశాచివని……
తెలిసి విస్తుపోయాను…….
నా చిలిపిచేష్టలే నాకు మేలు చేశాయి ,
నా చిన్నతనపు ఆలోచనలే నన్ను మేల్కొలిపాయి….
నా మదిలో ఆశలు ఆవిరి అయినా ,
నా ప్రేమలో నిజాయితి నీరై పోయినా ,
బలిగాబోతున్న నా భవిష్యత్తును ,
భద్రంగా కాపాడుకున్నా………
నా తల్లిదండ్రుల ఆశయాలకు వారధినవుతా ,
నా బంగరు భవితను చేరుకుంటా…………..
********