Like-o-Meter
[Total: 0 Average: 0]
గోపీ చందనంతో ఒకే ఒక ఊర్ధ్వ పుండ్రం తగదని
నగుమోము కననీక నామాలు పెడతారు
నిజపాద దర్శనం నియంత్రణలో ఉంచుతారు
నిజ రూప దర్శనం ఒక అపురూప భావనామాత్రం చేసారు
వడిబాయక తిరిగెడి వాడిని
గుడిలోపల ఆభరణాలలో దాచేసి
లఘు, మహాలఘు దర్శన భాగ్యం
తోసేస్తూ కల్పించిన వైనం వ్యధాభరితం
వేంకటేశుని దర్శనం సంకటమయం చేసి
స్వామి సేవలు ప్రత్యక్ష ప్రసారం చేయరు
దేవాలయ నిర్వహణ అంటే
భక్తులను భగవంతునికి దూరం చేయడమేనా?