ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

దోపిడీ

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ 
మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు?
 
ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ
మరి రోజూ  ముప్పూటల మెక్కు తుంటే?
 
ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ
రోజూ 10 గంటలు పడుకొంటూ ఉంటె?
 
మరి ఎన్ని సార్లు దొంగల్ని ఎన్నుకున్నా తెలియదే ఓటు విలువ
 
63 వసంతాల స్వతంత్ర భారతం ఇహ ఉలిక్కి పడదు
రోజూ జరిగే దోపిడీ జనజీవన స్రవంతిలో ఒక భాగం కనుక
పైగా అందరూ చేసేది ఏదో ఒక రూపంలో అదే కనుక !
మనకు తెలియదు మనం  దోచుకుంటున్నది మన అస్తిత్వాన్నేనని !!