ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గ్రీష్మ గీతం

Like-o-Meter
[Total: 0 Average: 0]

 
ఇంకా చూస్తూనే ఉన్నాం మనం
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ
వీధులలో తిరుగుతూ వ్యాపారం చేసి
చెట్టు నీడన సేదతీరి ముంత తినే ముదిరిన పేదలను!
 
చెట్లు ఇంకా ఉన్నాయి వీరి అదృష్టవశాత్తు
కాని ఖరీదైన కాలనీలలో కుళాయిలు కరువైనాయి
మంచినీళ్ళు ముష్టి అడిగి కష్టార్జితం భుజిస్తున్నారు
అందుకే వీరు ముదిరిన పేదలు
 
భవతి భిక్షాందేహి అనే పిలుపు వినపడదు
మాధవ కబళం పెట్టండి తల్లే అని ఎవరూ అనరు
జన వాసాలు ఇప్పుడు గటేడ్ కమ్యూనిటీలు
ప్రధాన రహదారి కూడలులు గుడులు పార్కులు దిక్కు బిక్షువులకు
 
మార్పు ప్రదేశాలను మార్చింది మినహా మనసులను కాదు
వృద్ది ధనవంతులను కొత్త ధనవంతులను శ్రుస్టించిది
పేదలకు  ఇంకా కనీస సౌకర్యాలు లేని జీవనమే తోడు
వారి జీవితంలో ఈ గ్రీష్మం భరించలేని ఒక శాపం.