ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

జంట దూకుళ్ళు

Like-o-Meter
[Total: 0 Average: 0]

రాజకీయ రంగస్థలంపై
ఒకే టిక్కెట్ పై ద్వంద్వ ప్రదర్శనలు
ఉచితమే చూడండి
బేరీజు వేయండి!
ఒక వేదికపై పలుకుబడులు
మరో వేదికపై పట్టుదలలు
పెట్టుబడులు – వెనుకబడులు
జుగల్బందీ వీక్షంచండి!
తడుములాటలు-తగువులాటలు
సరదాకాదు నిజమేనండోయ్!
ఎత్తుగడలు -పన్నుగడలు
గల్లీనుండి ఢిల్లీవరకు!
ఎగదోతలు – దిగ జారుళ్ళూ
షరామామూలే!
రెచ్చగొట్టడాలు – చిచ్చుకొట్టడాలు
రివాజు తంతులే
గోతులు తవ్వటాలు – బూతులు రువ్వటాలు
నేపథ్యసంగీతమే కదా!
బెదిరింపులు – అదిరింపులు
యాక్షన్‌ దృశ్యాలుంటాయి కదా!
ఇది ఎవరికి వర్తిస్తే వారికి
ఎవరు ‘ కీ ‘ యిస్తే
ఆడే కీలు బొమ్మలెవరో
వారికీ పైవన్నీ వర్తిస్తాయి
వెండి యవనికపై నర్తిస్తాయ్!
కష్టాల, నష్టాల షాక్ మాత్రం
జనాలకు ! ప్రదర్శన ఉచితమైనా!

**(వ్యంగ్య కవితావేశం) 13.08.2013

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>