ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మెట్రో

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

హైదరాబాద్  మెట్రో
పెట్టేరో జనాలను ఇబ్బందుల ఇరుకుల చట్రంలో
కొట్టరో ట్రాఫ్ఫిక్ చలానులతో
ఏమిటిరో  ఇంకా అర్ధం కాలేదా? 
ఐతే, పట్టరో  నేతలకు నీరాజనం!
 
జనం సుఖంగా ఉండకూడదు
అభివృద్ధి ముసుగులో ఆటంకాలు
కొన్ని ఫ్లై  ఓవర్లతో పోయేదానికి
పెద్ద ఫ్లై ఓవర్ గా మెట్రో కావాలట
కొన్ని బస్సులు వాహనాలు తిరగాల్సిన చోట
ఒక రైలు మాత్రమె తిరగాలట
మరి సందుల లో గొందులలో ఇల్లు ఉన్న వాళ్ళ గతి?
మళ్ళీ రోడ్డు దారే నట!!
రోడ్డేమో సన్న బడ్డది!!
 
మరెందుకు ఈ మెట్రో?
నేతలకు, కంపెనీలకు
కాలానికి ఈ మెట్రో ఒక కత్తుల వంతెన
ఒక ఐదేళ్ళపాటు 
పురజనులందరికి పురుటి నొప్పులు
 
భళా ప్రజా చైతన్యం!
ఏదైనా భారిస్తామనే ధైర్యం.
మెట్రో కావాలా వద్దా అని ఎవరిని  అడిగారు?
ఎవరు కావాలన్నారు?
అంతా ఏక  పక్ష నిర్ణయం ఇది భారత ప్రజాస్వామ్యం.