ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీకు పిచ్చా అవినీతి అంటే?

Like-o-Meter
[Total: 0 Average: 0]

అన్నం తిందామంటే అన్నా
టీవీ చూద్దామంటే అన్నా
పేపర్ తెరగేస్తే అన్నా
ఆఫీసులోనూ అన్నా కబుర్లే
పిల్లలకూ తెలుసు అన్నా
కాని మన పార్లమెంటు సభ్యులకు మాత్రం 
అన్నా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకి 
ఎందుకంటే వారు వాడే పార్లమెంటు ఒక అవినీతి అడ్డా
అన్నా అంటే హన్నా !!
 
గత ఆరు దశాబ్దాలుగా
పార్లమెంటు సాక్షిగా
ఎంత అవినీతి జరిగిందో
అందరకూ తెలుసుగా
 
పార్లమెంటు ఘనతకు
అన్నా విఘాతమాట
అవినీతి పట్ల
ఆచితూచి మాట్లాడాలట!