Like-o-Meter
[Total: 0 Average: 0]
ఒకటా – రెండా ?
కొన్ని పక్షులు చీమల్ని తిని బతుకుతాయి
ఆ పక్షులు చచ్చాక వాటి దేహాన్ని ఆ చీమలు తింటాయి
కొందరు కొందరిని దూషించి హమ్మయ్య అనుకొంటే
వారిని కొందరు దండించి చేతులు దులుపుకుంటారు
ఒకడు మరొకడికి రావలసింది సగం కాజేస్తే
వాడికి అంతుచిక్కని రోగం వచ్చి అంతకు మూడింతలు ఖర్చు
తినగలిగిన వాళ్ళ కు తిండిగింజలివడంలో దగా చేసినోడికి
షుగర్, బీపీ, కొలెష్ట్రాలు వచ్చి పచ్చి కూరలు తింటాడు
ఏసీ రూములో నిద్దరట్టక దొర్లే ప్రాణులూ
ఎండ పడుతున్నా వొళ్ళు తెలియని నిద్రలో కొందరూ
స్వచ్చమైన సంసారి – ఇళ్ళు కట్టి అద్దెకిచ్చి నాదే ఇదంతా అని పొంగిపోతాడు
స్వచ్చమైన ఒకటా – రెండా విరాగి – ఇది నాది కాదు అని అద్దిచ్చి చక్కా తనదిలా ఉంటాడు