ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఒసామా – ఒబామా

Like-o-Meter
[Total: 0 Average: 0]

 
ఇద్దరికీ తేడ లేదంట సభ్య సమాజం దుమ్మెత్తి పోస్తుంది
కాని పోలికలున్నయంటే ఒప్పుకుంటుంది
ఎందుకంటే ఇద్దరూ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళే!
ఒకరు ఉగ్రవాదం ఆయుధంగా కలవారు
మరొకరు  ఉగ్రవాదాన్ని ఆయుధాలతో, ఆయుధ వ్యాపారంతో అణచాలని చూసేవారు
 
ఉగ్రవాదులకు అగ్రరాజ్యానికి అడ్డా పాకిస్తాన్ గడ్డ
అక్కడే వ్యవహారం, సంహారం కూడా
ఒసామా ఇక లేడని ఒబామా అన్నంత మాత్రాన
ప్రపంచంలో ఉగ్రవాద సమస్య సమసిపోదు లేశమాత్రమైనా
 
చావ వలసింది ఆయుధ వ్యాపారం ముసుగులో జరిగే నూతన ఉగ్రవాదం
జీవించవలసింది జాతులను జాగృతం చేసే  నిరాయుధీకరణ ఉద్యమం 
దేశ రక్షణ వ్యయం దేశంలో ని నిరుపేదల ఉద్ధరణకు మళ్ళించ గల పరివర్తనం   
ఆకలి అనారోగ్యం అవిద్య అరాచకం  లేని సమాజ నిర్మాణ సంకల్పం