ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పొలికేక

Like-o-Meter
[Total: 0 Average: 0]

అరుస్తూ పొతే అవదు అది పొలికేక
చస్తూ బతుకుతుంటే అరవడానికి ఓపికుండదు
తిన్నది అరగడానికి అరిస్తే అది ఒక ఆట
అవినీతిని అసహ్యించుకొంటూ అరిస్తే అది ఉద్యమం!
 
మరి…..
 
కొన్ని గొంతులు ఒక్కటై ఒకే లక్ష్యం కోసం
ఒకే రకమైన మార్పు కోసం
చిరకాలంగా ఎదురుచూసే ఆనందం కోసం
సమాజంలో మానవత్వం మకుటమనే  కోట్ల మనసుల విశ్వాసం కోసం
అన్ని గుండెలలోని ఆవేదన, ఆర్ద్రత, ఆరాటం, అభిమానం 
ఆగ్రహం తో కలసి మౌనం గా ఆలపిస్తే  వచ్చే జన గళ స్వరం ఒక పొలికేక
ఇది జాతిని శబ్దం లేకుండా పిలుస్తుంది
జాతి హృదయాంతరాలలో ధ్వనిస్తుంది
ఇదీ ఈనాడు అవినీతి పై జరిగే ఈ పోరాటం లో వినిపించే పొలికేక స్వభావం.