Like-o-Meter
[Total: 0 Average: 0]
పచ్చని మొక్క చూసినపుడు
అదే రంగు పులుముకొని తినే
ఆకుపురుగు కనబడదు
పక్కనున్న వ్యక్తి
కట్టుకున్న బట్టలు
చల్లుకున్న పేర్ఫ్యుమే
ప్రామాణికాలైతే ప్రమాదమే
ఒక మంచిలో చెడును వెతకడం
ఒక చెడులో మరిన్ని చెడులు చూడడం
అలవాటుగా మారిపోయింది
అనుమానపు అరుణోదయాలలో
మంచి మంచులా కరిగిపోతుంది
అపోహా, అనుమానం
అమాయకత్వాన్ని కమ్మేస్తున్నాయి
కోటికొకరికి కూడా ద్యోతకం కాని జ్యోతి
అయ్యప్ప మకరజ్యోతి గా దర్శనమిస్తుంటే
విశ్వాసమే ప్రాతిపదికైన మహాప్రస్థానానికి
ఇంకా ఎన్ని అవారోధాలో, అవమానాలో
కాని ఒకటి నిజం
అదే మనః సాక్షి
అదే నిజమైన మకర జ్యోతి
జాతికి ఆశా కిరణం