ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సర్వ జీవయానం కేశవం ప్రతి గచ్చతి !

Like-o-Meter
[Total: 0 Average: 0]

చిన్న రెక్కల పురుగులు

అప్పుడే పుట్టి కాంతిని తినడానికి
తాపత్రయపడుతూ అంతలోనే నేలరాలతాయి
అక్కడే ఉన్న ఎర్ర చీమలు
ఇంకా బ్రతికున్నావాటికి తాపీగా భోంచేస్తాయి
ఈ అల్లరి చూసిన ఇల్లాలు చీపురుతో తుడిచి
చీమల్ని వాటి బతికున్న ఆహారాన్ని చేటకు ఎత్తి
అప్పుడే వాన నీళ్ళలో నిండిన పెంటకుప్పలో  పోస్తుంది
చీమలూ తనువు చాలిస్తాయి వాటి ఆహారంతో పాటు
చిత్రం ఏమంటే వైశ్వానరుడు ఆకలి రూపంలో జీవులకు
పునర్జన్మనిస్తున్నడనే విషయం తేటతెల్లమౌతుంది
ఈ చీమలు ఆ లైటు పురుగులు ఎప్పుడు మానవ జన్మ ఎత్తుతాయో?
ఈ మనుషులు ఎంతమంది ఆ చీమలు లైటుపురుగులుగా మారతారో?
ఎమాశ్చర్యం ప్రాణమై సంచరించే పరమాత్వ తత్త్వం !
సంకల్పమనే స్వేచ్చ నిచ్చే సనాతన ధర్మం!