ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

స్వాతంత్రానికి ఇరు పార్శ్వాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

అరవై ఐదు సంవత్సరాల అరుపులు కేకలు
శుష్క వాగ్దానాలు క్రియా శూన్యాలు
సమాజాన్ని విభజిస్తూ పోవడాలు
పాలిటిక్స్ ను  ఒక అడ్డాగా మార్చి
పాలిస్తూ సంపాదించుకోవడాలు
ఇది ఒక పక్క జరుగుతున్న తంతు అయితే
 
మరోపక్క:
మత మార్పిడులు జరుగుతున్నా
మత విద్వేషాలు కొనసాగుతున్నా
లౌకికత పేరుతొ అలౌకికానందం
అందించే ఒకే ఒక  ఆధారాన్ని త్రోసిరాజన్నా
శాశ్వతమైన ఆత్మలా
శాశ్వత చలన యంత్రంలా
తన పని తానూ చేసుకోపోతోంది
భారతీయుల సనాతన ధర్మం !!