ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వసంత గానం

Like-o-Meter
[Total: 0 Average: 0]

కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ

మల్లె మందారాలు సన్నజాజుల తొను
సంపెంగ విరజాజి పూల విందుల తోను
పుడమి పులకించె పండు వెన్నెలలోన
వచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా

మీటిన వీణలా వేణునాద రవళిలా
మందహాసము చేసె అందాల ఆమని
కన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవో
సిగ్గు దొంతర లోన మదుర భావాలేవో ..కమ్మగా

 

యమునా తీరాన రాస లీలల తేలు
చిలిపి కృష్ణుని తీరు తలచెనేమొ
గున్న మామిడి పైన గువ్వ జంటల వలపు
గుట్టుగా గుర్తుకి వచ్చెనేమొ…కమ్మగా

మృదు మదుర భావాలు పిల్ల గాలుల తేలి
మూగ బాసలలొన మురిపించెనెంధుకో
ఊహలలో వరుని రూపు ఊరించెనేమొ…కమ్మగా

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>