ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

విగ్రహం చూసి తప్పిన నిగ్రహం!

Like-o-Meter
[Total: 0 Average: 0]

బంజారా హిల్స్ హై పాయింట్ పై
అయ్య వై. ఎస్. “సాక్షి” భవనానికి
హై చెబుతూ సాక్షి గా నిలచాడు
తనయుడు తన్మయుడయాడు
ఇది జగ(నె)మెరిగిన సత్యం
 
మీకిస్తా వంద
నే పుచ్చుకుంటా అంతా
పావలా వడ్డీ మీకు
పలు లావాదేవీల్లో పలహారం నాకు
 
నా సందేశం: నీకోసం కాదు నీ శ్రమ 
నీ తదనంతరం తర తరాలకొరకు కావాలి
నా చిహ్నం: వికసించిన హస్తం!
నా సౌజ్ఞ: వేళ్ళతో ముడిచిన అరచేయి!
 
అర్థమైన వారికి అర్థమైనంత
అర్ధంతర మరణమంత
సాక్షికి సాక్షే బలమంతా
గతంలో కలిసేవి నిజాలంతా!