ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఓ దీపమా!

Like-o-Meter
[Total: 0 Average: 0]

 వెలుగుతో ఓ సంద్రాన్ని సృజియించి 

అందు ముత్యమై మెరిసేవు నీవు!
అలలేవని ఎవ్వరడిగేరు నిన్ను
గాలి కూయలలూగేవు
నీవు విత్తుకున్నది ఆదిగా! ప్రతి పుటలోనూ,
కాంతి పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ
నా మనసో వాసంత వాచకాన్ని చదువుతుంది
నా కనుపాపలింట నీ వెల్గు తోరణమొక్కటి కట్టుకుంటే
నాలోని అణువణువులో నవ్య చైతన్యముదయిస్తుంది
స్వాగతించే కిలకిలలు,
వీడుకొల్పే కువకువలూ ఒద్దంటూ
సంధ్యలకు చేతకాని స్వర్గాన్ని ఈ నా చీకటి గదిన
ఇట్టే నీవెలా వెలయించితివే, ఓ దీపమా!

 

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>