Like-o-Meter
[Total: 0 Average: 0]
మిణుగురులు
నింగి విడిచిన నేల జువ్వలో?
గాలిలో షికారుకెళ్ళే దివ్వెలో?
చుక్కల ప్రతిబింబాలను పట్టి చీకటికి చూపెట్టే దర్పణాలో?
నిశా సౌందర్యానికి, కాలపురుషుడు పట్టే హారతులో?
ఈ మిణుగురులు.
*******
అహం
కడవలో నాలుగు రాళ్ళేసి
దాహం తీర్చుకున్న కాకుల్లా కాకుండా
జీవితాల్లోకి నాలుగు రాళ్ళేసి
అహాన్ని తీర్చుకుంటున్నారేమిటీ లోకులు.
**********
**********
దారిద్ర్యం
దారిద్ర్యమే పట్టకపోతే!
అంతటి వైభోగమెక్కడిదా నటికి
అదేనోయ్ వస్త్రదారిద్ర్యం.
********
********
ఇజం
ఏదో ఒక ఇజం చేతిలో
ఓడిపోయిన నిజమే
చరిత్రయినా వర్తమానమయినా
అంతెందుకు భవిష్యత్తయినా.
*******
*******