ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆమెలో నేను

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆమె పసిచెవి కొస రింగునై
భుజాల మీద ఎగురుతూ
బాల్య వాసనల దుమ్ముని
ఒళ్లంతా పూసుకొంటాను.
ఆమె యువహృదిపయి తాళినై
గాఢంగా హత్తుతూ
సుఖ దుఃఖాల లేపనాన్ని
గుండెల్లో రుద్దుకొంటాను.
ఆమె పృధు గళమున నగనై
గాంభీర్యానిస్తూ
జీవన భారపు రుచుల్ని
నుదుటిపై రాచుకొంటాను.
ఆమె ముదికరమున కర్రనై
పిడికిట్లో నడుస్తూ
గతవాసనల కమ్మదనాన్ని
మధురంగా పాడతాను