ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆమె

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆమెను చూస్తేనే ఏవగింపు అసహ్యం

ఛీత్కారాలు చీదరింపులు

కానీ ఆమె ఎందఱో తల్లుల బిడ్డలకు అమ్మ

కన్నతల్లి వద్దనుకుని బిడ్డను విసిరేసినా

ఆమె మాత్రం అక్కున చేర్చుకుని

దిక్కులనే అంబరాలు కట్టి మురిసిపోతుంది

ఆ వీధి శునకాల, వరాహాల జోలపాటలతో లాలిస్తుంది

పసికూనలకే కాదు ఎందరో వీధి బాలలకు అన్నపూర్ణ

ఆమె

ఇంకెందరో అనాధలకు బ్రతుకుతెరువు ఆమె

ఆమె మాతృత్వ ప్రపంచాన భేదమనేదే లేదు

అది మనిషైనా, పశువైనా ఆమె మాతృత్వ మమకారానికి

 లోటు లేదు

అందరి కల్మషాన్ని తానే స్వీకరించి కూడా

నవ్వుతూ నిలిచినా ఆ స్థితప్రజ్ఞ నేమనాలో

 చెప్పగలవారెవ్వరు?


మీరేమైనా……..

**********