ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అలజడికి అటువైపు

Like-o-Meter
[Total: 0 Average: 0]

1. అలజడి

రైలు ప్రయాణం
చీకట్లో ఏ సొరంగాన్ని దాటుతున్నా
వంతెనపై ఏ ప్రవాహాన్ని దాటుతున్నా
ఎదురౌతున్న మరో రైలును దాటుతున్నా

అదే అలజడి!

2. అటువైపు

సీతాకోక ఎగురుకుంటూ
కట్లపాము పాక్కుంటూ
కప్ప గెంతుకుంటూ
రోడ్డు దాటేసాయి.

నేనెప్పుడో..!