ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అలసట

Like-o-Meter
[Total: 0 Average: 0]

వొర్షం రాత్రి

బురదకాళ్ళీడ్చుకుంటూ

ఇంటికి…

 

మత్తుకాంతిగదిలో

పగిలిన గాజుపెంకులు

మెరుస్తూ…

 

లేత నీడల సాలెగూడు చిక్కుపొరల

తెరచాటుతనం!

సరే

 

నువ్వన్నట్లుగానే

పారిపోదాం

గుర్తించని చోటుకి….

(ప్రియా! మిగిలినదాన్ని నువ్వు పూరించు)