ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంతకన్నా

Like-o-Meter
[Total: 0 Average: 0]

1

పొద్దున్నే కిటికీ రెక్క అద్దాన్ని పొడిచి

రెక్కలేగరేసి ఆడుకుంటుంది చామన చాయలో,

వొక చలికాలపు గడ్డకట్టిన రాత్రి తరవాత, నీరెండ.

 

సర్లే, పోనీలే  అనగలనా,

దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా.

దాని చేతిలో చెయ్యేసి,

తన గోర్వెచ్చనితనాన్ని నాలోకి వొంపుకోకుండా.

2

ఇప్పుడింక గుర్తొస్తుంది, చిన్నప్పటి నా చింతకాని.[i]

 

ఇంకా తెల్లా తెల్లారక ముందే

ముసురు తెరల్లో నీడల్లా దాక్కునే చెట్ల వేపు

దేహాన్నంతా చుట్టబెట్టుకొని వూరి బయటకి నడిచివెళ్తున్నఆ  నేను.

3

ఏం వెతుక్కుంటావో, అలసిపోయేంత దాకా

ఆ వూరి చివర చెట్ల మంచు తెరల మధ్య!

 

పోనీ, ఇప్పుడయినా నీ లోపలి గుట్టు విప్పవా,

నీరెండ వేళ్ళు నిన్ను

తడిమి తడిమి తెరుస్తున్నప్పుడు!



[i] చింతకాని: కవి స్వస్థానం.