ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంతర్వాహిని

Like-o-Meter
[Total: 0 Average: 0]

అనురాగపు అంతర్వాహినులను

ఇముడ్చుకున్న ఎడారులు

ఆశ్రమాన ఆ వృద్ధుల మోములు.

       ********

జీవితాలను తూర్పారబెడితే

గుప్పెడైనా అనుభూతుల గింజలు

రాలతాయా ఈ రోజుల్లో.

*******

లోకమంతా మెచ్చే

నేతగాడే గానీ

వాడు నేసిన చీరను

అమ్మడం చేతకాక

తెల్లవారకుండానే మడత పెట్టుకుని


వెళ్ళిపోతాడా జాబిలి.

********

గోదారిని నాగేటి చాళ్ళుగా
చేస్తుంటే ఆ పడవలు
జాబిలి మాత్రం ఊరుకుంటాడా
ఆ చాళ్ళలో వెన్నెలలు నాటకుండా.

కురులు విప్పిన వానకు
మల్లెల గుబాళింపు
ఈ మట్టి వాసనే.

    *******