ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బావిలోని కప్ప వొంటరిది కాదు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

కొండలకు కళ్ళుంటాయ్

గుండె లోయల్లోకి జారిపోయిన వాటిల్నేవో

పగలు రాత్రీ వెతుక్కుంటుంటాయ్

 

నోరున్న మేఘాలు భోరుమంటూంటాయ్

మాటల్ని కురిపిస్తుంటాయ్

మేఘం మాట నేల మీద చిట్లినప్పుడు

బద్దలైన రహస్యమొకటి అనామకంగా

అడుగులోకి మడుగైపోతుంది

 

మనసు పోగొట్టుకొన్న నేను

గతం గోతిలో, యిజాల నూతిలో

బెకబెకలాడుతుంటాను

నాతో నేను, నా వెనుక మరో నేను

ఇరుపక్కలా నేను…నేనే

యీ బావిలోని కప్ప వొంటరిది కాదు!