Like-o-Meter
[Total: 0 Average: 0]
చిటపట అల్లరి చేసిన
వాన చినుకులకు
నోరు తెరిచిన బీడు
జోల పాడింది.
****
తాను రాసిన పాటను
పాడడం కోసమని
ఎన్ని గొంతులను మేల్కొల్పిందో
ఆ ఉదయ సుందరి.
*****
ఎంతకాలమలా నిలబడుతుంది పాపమని
తనపై పడిన చెట్టు నీడను
ఊయలలూపుతోందా చెరువు.
*****
అందరూ గుర్తింపు కార్డును
ముందుకు వేసుకుంటే
తానొక్కటే వీపునెందుకో
ఆ మిణుగురు.
*****