ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

భారం

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎవరికీ తెలియకూడదని

వదిలించుకున్న తొమ్మిది నెలల

భారమదని పాపమా కుక్కలకేం తెలుసు

అందరికీ తెలిసేలా

పంచేసుకున్నాయి మరి.

     *******

ఉన్నోడు

స్వర్గంలో కూర్చుని తాగుతాడు
లేనోడు
తాగి స్వర్గానికెళ్తాడు
మొత్తానికి స్వర్గమొచ్చి
వీధి వీధినా పడిందోయ్.

     *******

ఆ సాలెకు గూడు
చేసిన సాయం
ఈ సాలెకు గుడ్డ
చేయలేకపోతోంది.

     *******