ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చరిత్ర లోకి నేను నడిచాను – హైకూలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆకాశాన్ని దీవిస్తూ

అక్షతలు  విడిచిందా  పంట చేను

పక్షి  గుంపులుగా

***********

కృష్ణుడే వచ్చి

కుచేలునికి మూడు గుప్పిళ్ళిచ్చి

అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే

రాజకీయమంటే!

***********

నలుగురితో సంఘర్షించిన వేళ

చరిత్ర లోకి నేను నడిచాను

నాతో నేను సంఘర్షించిన వేళ

తనుగా వచ్చి నాతో నడచిందా

చరిత్ర

**********

అడవిని వదిలామని

అందరూ నమ్మడానికి

ఇంకెంతగా మారాలో కొందరు

**********