ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చెప్పలేను

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒక్కోసారి
అలా ఐపోతూ వుంటుంది

రెప్పకు రెప్పకు మధ్యన
ఉప్పునీళ్ళ జీవితం
ఇరుకుగా, కరకుగా కదులుతూ వుంటుంది

ఏవో నీతులు, జాతులు, గోతులు
పావురాయి కాలికి కట్టిన దారంలా
పక్కలో బల్లెంలా
బక్కటెముకల్లో గుచ్చుకుంటుంటాయి

చిత్తుకాగితంలాంటి ప్రపంచాన్ని
ఉండ చుట్టేసాను కానీ
చెత్తబుట్టే కనబడ్డంలేదు

ఎందుకో ఒక్కోసారి
అలా ఐపోతూ వుంటుంది!