ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చెప్పుకోండి చూద్దాం !

Like-o-Meter
[Total: 1 Average: 3]

నేనొక క్షణ క్షణం బలి ఔతూ

అదే సమయంలో

ఏవేవో స్మృతుల జడిలో తడిసి

బెంగను, కవిత్వాన్ని పుట్టించే వాణ్ణి.

 

నాలోనే సమస్త మలినాలూ…స్వచ్చత…అంతా!

కలలన్నీ నా పైనే 

జీవన యానాలన్నీ నా లోకే

విశ్వంలో ఉన్న సమస్త ఆనందం నాతోనే

 

ఐనా నన్నే ఎందుకు ద్వేషిస్తారు?

నా మాట ఎందుకు వినరు ?

నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వరు ?

 

నా పెట్టుబడిని నేనే అనుభవిస్తాను

నేను చేసినది నాకు అనుభవంలోకి వస్తాయి

మొదట ఎలా ఉన్నానో తుదకు అలా మారాను

కరుడు కట్టిన నా దౌర్బల్యపు గందరగోళంలో

నేను బరువా, సంపదనా?

నాకే తెలియదు

 

ఇంతకూ నేను ఎవరిని?