ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చిరు కోరిక

Like-o-Meter
[Total: 0 Average: 0]

తూర్పు వికసించి
కలల పక్షులు ఎగిరిపోయినా

ఒక్కో ఉదయం…
ఏ పిట్టా పలకరించని చెట్టులా
నిశ్శబ్దంగా

నా పని కొమ్మ
చుట్టూ ఇంతమంది
ఆకుల్లా గల గల లాడుతున్నా

కదిలించే కిల కిల రావాన్ని
వెతుకుతూ మనసు

అణువణువూ పులకించి పుష్పించాలంటే
నీలి మబ్బు వలపు ధార
నాకిప్పుడు కావాలి.