Like-o-Meter
[Total: 0 Average: 0]
ఎడారి ముఖ చిత్రాన్ని
మార్చేసిందా గాలి
ఉన్మాదంతో.
*******
నఖశిఖ పర్యంతమూ
తన విభుని సౌందర్యాన్ని
చూడాలని కాదూ
కరిగి లోయలలోకి జారేది
ఆ మేఘం.
********
నిదుర మనోమెలకువ అనే
రెండు కత్తులనూ ఎంతందంగా
తన ఒరలో ఇముడ్చుకుంది
ఆ స్వప్నం.
*******
తీరు మారని తరాలు
ఎన్ని మారినా
నా తలరాత మారదుగా
అంటూ మథనపడుతోంది
నా దేశ సంస్కృతిపుడు.
********