ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఏకాంతం

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఋజువేది నా ఏకాంతానికి

మళ్ళీ మళ్ళీ నాలో

ప్రతిధ్వనించే నీ పిలుపులు తప్ప.

 *********

నావైన రెండు ఆనందభాష్పాల మీదుగానే

నీ మనసు లోతుల్లోకి జారింది

ఈ ప్రకృతి.

*********

నీ , నా మనసుల

పారవశ్యానికి నడుమ

ఒద్దికగా కూర్చుందే

ఈ ప్రకృతి.

********

తనను తాను

కుంచెగా మలచుకుంది ప్రతిచెట్టు

ఓ పచ్చని చిత్రాన్ని

ఆ ఆకాశపు కాన్వాస్ పై గీద్దామని.

********