ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గతం

Like-o-Meter
[Total: 0 Average: 0]

గతం లోకి నే చేసిన

రంధ్రాన్వేషణ

నా భవిష్య దారుల వెంట

నా లోతు గోతులు తవ్వింది.

         *******


భానుడే వచ్చి కోప్పడినా


తెల్లారలేదని బదులిచ్చే

ఎన్నో జీవితాలు
 

మత్తులో పడి  కొట్టుకుంటున్నాయి  

ఆ పబ్బుల్లో పడి.

       *********

చీకటిని రెండుగా చీల్చే

ఖడ్గమా దీపం


ఒక దాన్నే అందరూ చూస్తారు

ఇంకోదాన్ని కొందరే గుర్తిస్తారు.

       *********